భక్తిశ్రద్ధలతో మైసమ్మ తల్లి 25వ వార్షికోత్సవ వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట-1 గని ఆవరణలో కొలువుదీరిన శ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదేలును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఓదేలుకు గని అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 25 ఏళ్లుగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి కృపా కటాక్షాలు సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు వేడుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});