మందమర్రి ఏరియా అభివృద్ధిపై జీఎం ప్రత్యేక సమీక్ష

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి అధికారులకు జీఎం ఎన్. రాధాకృష్ణ ఆదేశం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి మందమర్రి ఏరియా అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్, అకౌంట్స్, సివిల్, ఐఈడీ (IED) విభాగాల అధికారులతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా విభాగాల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని జీఎం అధికారులను...