పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
అధికారులకు జీఎం ఎన్. రాధాకృష్ణ ఆదేశం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి మందమర్రి ఏరియా అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్, అకౌంట్స్, సివిల్, ఐఈడీ (IED) విభాగాల అధికారులతో ఈ సమావేశం జరిగింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా ఆయా విభాగాల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని జీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలతో పాటు పరిపాలనా పరమైన పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, మందమర్రి ఏరియా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో ఎస్‌ఓటు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (ఎఫ్ అండ్ ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, డీజీఎం (ఐఈడీ) కె. కిరణ్ కుమార్, సివిల్ డీజీఎం మదీనా భాషతో పాటు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});