బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామంలో శుక్రవారం ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ (బాల్య వివాహ రహిత భారత్) కార్యక్రమం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలికలకు,...