మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా పఠింపజేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హృదయం వంటిదని అన్నారు. ప్రతి భారత పౌరుడు అనుసరించాల్సిన ప్రాథమిక విలువలు, హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రగాఢ పరిజ్ఞానం, దూరదృష్టి, సమానత్వ భావజాలం నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థలో ప్రతి ఉద్యోగి తమ విధుల్లో పారదర్శకత, నిజాయితీ, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను పాటించడం అత్యంత అవసరమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కార్యరూపంలో పెట్టినప్పుడే సంస్థ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమం మరింత బలపడుతుందని అన్నారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, తమపై ఉన్న బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వర్తించాలని జీఎం సూచించారు.ఈ కార్యక్రమంలో SO to GM జి.ఎల్. ప్రసాద్, AITUC బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం జాయింట్ సెక్రెటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ కార్తీక్తో పాటు జనరల్ మేనేజర్ కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});