మైసమ్మ తల్లి దివ్య సన్నిధిలో భక్తి పారవశ్యం
కాసిపేట–1వ గని ఆవరణలో మహా చండీహోమం..
భక్తులకు ఆహ్వానం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
అమ్మవారి కృపాకటాక్షాలతో, భక్తుల హరిహర నామస్మరణల మధ్య శ్రీశ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసిపేట–1వ గని ఆవరణలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు అమ్మవారికి విశేష పూజలు, మహా చండీహోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని కొలిచి, లోకకల్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ పవిత్ర కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య దర్శనం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది, తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులు కావాలని భక్తులకు ఆహ్వానం పలికారు.“శ్రీశ్రీ మైసమ్మ తల్లి కరుణాకటాక్షాలతో సర్వలోకాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలి” అని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});