CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 12:10 pm Posted By: coalbelt 24 News

మహిళల హక్కులు.. రాజ్యాంగం అమలుపై సమగ్ర చర్చ

ఈ నెల 26న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సదస్సు
ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత
సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘మహిళలు – రాజ్యాంగం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారని పెద్దపల్లి నియోజక వర్గం పార్టీ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు. ఈ సదస్సును విజయ వంతం చేయడానికి అన్ని వర్గాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్బంగా కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు, వాటి అమలు తీరుపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మహిళలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులు క్షేత్రస్థాయిలో ఎంతమేరకు అందుతున్నాయి? మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతలో ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి? అనే అంశాలపై చర్చించనున్నారు.

వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, శ్రామికులు, గృహిణులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన స్థితిగతులు, సమాన అవకాశాలు, మహిళా హక్కుల పరిరక్షణ, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలకు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మహిళల అభ్యున్నతికి రాజ్యాంగం కల్పించిన అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై మహిళా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. మహిళా సమస్యలను కేవలం సామాజిక అంశాలకే పరిమితం చేయకుండా రాజకీయ, ఆర్థిక, రాజ్యాంగపరమైన కోణాల్లో చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసేలా సదస్సును నిర్వహించేందుకు తెలంగాణ రక్షణ సేన ఏర్పాట్లు చేస్తోంది. చర్చల అనంతరం మహిళా హక్కులు, సాధికారత, సమానత్వం, రాజ్యాంగ హామీల అమలుకు సంబంధించి పలు తీర్మానాలు చేయనున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});