ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమ్మె నోటీసు

డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతాం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కార్మికులు కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్‌వైజర్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసు, వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్ 7, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తామని కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులను ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్‌ (IHFMS) నుంచి...