కార్తీక పౌర్ణమి వేళ కార్తీక దీపాలు వెలిగించిన కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలను వెలిగించి పరమశివుడిని భక్తిప్రపత్తులతో ప్రార్థించారు. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుందని, ఈ మాసంలో దీపారాధనకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించే దీపాలు కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు,...