కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలను వెలిగించి పరమశివుడిని భక్తిప్రపత్తులతో ప్రార్థించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుందని, ఈ మాసంలో దీపారాధనకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించే దీపాలు కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకునే భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు.
కార్తీక పౌర్ణమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా పండుగ ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకున్నారు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});