CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 8:09 pm Posted By: coalbelt 24 News

flash …flash …flash .. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు శుభవార్త

30 వేల కుటుంబాలకు ప్రయోజనం..
1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య
ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యం ఉత్తర్వులు..
కార్మిక కుటుంబాల్లో హర్షం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించేందుకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందించేలా మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కాంట్రాక్ట్ కార్మికులు తమ పిల్లల విద్య కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఎంతో ఊరటనివ్వనుంది. సింగరేణి పరిధిలోని విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్పించి విద్యనందించుకునే అవకాశం కలగడంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు విద్యా సదుపాయం కల్పించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ పిల్లలకు మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యా ఖర్చుల భారం కూడా తగ్గుతుందని వారు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి మరో ముందడుగుగా నిలుస్తుందని కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉచిత విద్యా సదుపాయం కల్పించిన ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});