పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. భారీగా పెరిగిన ధరలు
10 గ్రాముల బంగారంపై రూ.2,091 పెరుగుదల.. కిలో వెండిపై రూ.2,633 పెంపు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గత ట్రేడింగ్ సెషన్తో పోలిస్తే సోమవారం పసిడి, వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గత సెషన్లో రూ.1,26,450గా ఉండగా, సోమవారం రూ.2,091 పెరిగి రూ.1,28,541కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650గా...