జోనల్ నెట్‌బాల్ పోటీల్లో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ
కోల్ బెల్ట్ న్యూస్ స్పోర్ట్స్: మందమర్రి పట్టణంలోని హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు జోనల్ స్థాయి నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 17న నిర్వహించిన జోనల్ నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా జట్లపై విజయం సాధించి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఎస్.కె. షహబాజ్, పిప్రే శివచరణ్, రేకుల సాహెత్, వేముల శశివర్ధన్, నాగుల జాయ్ అత్యుత్తమ ప్రతిభ...