CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 8:45 pm Posted By: coalbelt 24 News

జోనల్ నెట్‌బాల్ పోటీల్లో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ

కోల్ బెల్ట్ న్యూస్ స్పోర్ట్స్:

మందమర్రి పట్టణంలోని హైదరాబాద్‌ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు జోనల్‌ స్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 17న నిర్వహించిన జోనల్‌ నెట్‌బాల్‌ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లా జట్లపై విజయం సాధించి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన ఎస్‌.కె. షహబాజ్‌, పిప్రే శివచరణ్‌, రేకుల సాహెత్‌, వేముల శశివర్ధన్‌, నాగుల జాయ్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా మందమర్రి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్స రమేష్‌ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా శిక్షణ పొందాలని సూచించారు. ప్రతి పాఠశాలలో క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. చదువు, క్రీడలపై దృష్టి కేంద్రీకరిస్తే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు. కృష్ణవేణి పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక కావడం మందమర్రి పట్టణంతో పాటు మంచిర్యాల జిల్లాకే గర్వకారణమని సీఐ రమేష్‌ కొనియాడారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});