CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 12:00 pm Posted By: coalbelt 24 News

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధర రూ.1,710 డౌన్‌
వెండి కిలోపై రూ.1,789 తగ్గుదల
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,710 తగ్గి రూ.1,26,450కు చేరుకుంది. గతంలో ఈ ధర రూ.1,28,160గా ఉంది. ఆభరణాల తయారీలో అధికంగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,100గా నమోదైంది. ఇక వెండి ధర కూడా దిగివచ్చింది. కిలో వెండిపై రూ.1,789 తగ్గడంతో ధర రూ.1,53,111కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});