CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 9:57 pm Posted By: coalbelt 24 News

బీజేపీ బలోపేతానికి యువత రాజకీయాల్లోకి రావాలి

మైనార్టీ మోర్చా సమావేశాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లాల పర్యటనలో భాగంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్తో కలిసి ఆయా జిల్లాల్లో నిర్వహించిన మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశాల్లో రజనీష్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, మైనార్టీ వర్గాల్లో బీజేపీకి ఆదరణ పెంచే విధంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సమావేశంలో రజనీష్ జైన్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో యువత పాత్ర రోజురోజుకూ కీలకంగా మారుతోందన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయాలను కేవలం పదవుల కోసం కాకుండా ప్రజాసేవకు వేదికగా భావించాలని సూచించారు. బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో యువతను రాజకీయంగా చైతన్యపరిచి, పార్టీ కార్యక్రమాల్లో వారిని మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మైనార్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేయాలని రజనీష్ జైన్ సూచించారు. పార్టీకి బూత్ స్థాయి నుంచి బలమైన సంస్థాగత నిర్మాణం కల్పించడంతో పాటు, మైనార్టీ వర్గాల్లో బీజేపీపై ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మైనార్టీ మోర్చాను మరింత క్రియాశీలం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పర్యటనలు కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. మైనార్టీ వర్గాల నుంచి యువతను పెద్దఎత్తున పార్టీలోకి ఆకర్షించడంతో పాటు, రాబోయే రోజుల్లో రాజకీయంగా వారికి ప్రాధాన్యం కల్పించే దిశగా పార్టీ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});