ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్‌తో కలిసి ఇందిరమ్మ బీమా యోజన ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత...