CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 9:21 pm Posted By: coalbelt 24 News

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల):

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్తో కలిసి ఇందిరమ్మ బీమా యోజన ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ పథకం కింద కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. పథకానికి సంబంధించిన ఇతర ప్రయోజనాలు అర్హత నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు అందుతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ శిబిరాలకు హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అగ్గు సాగర్, గోపాల్‌రావు, రాజేశ్వరి, ఖలీద్, సంపత్‌రెడ్డి, మందమర్రి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సాయి కిరణ్, అసిస్టెంట్ ఇంజనీర్ టి. వినీత్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 5, 20వ వార్డుల కౌన్సిలర్లు దాముక శిరీష్ రమేష్, కూతురు ప్రభాకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});