కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పట్టణంలోని బి-1 క్యాంపు కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించినందుకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});