ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని పొన్నారం గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ పెంచాల మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పించడంతో పాటు, ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈఓ గణపతి, మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ మహేష్ హాజరయ్యారు....