CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:42 pm Posted By: coalbelt 24 News

పదేళ్లుగా పనిచేసిన సెక్యూరిటీ గార్డులకు మొండిచేయి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఎస్‌అండ్‌పీసీ పరిధిలో గత పదేళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న కొందరు కార్మికులను ప్రస్తుత కాంట్రాక్టు పరిధిలో తిరిగి విధుల్లోకి తీసుకోకుండా పక్కనపెట్టారని బిఎస్పి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. శనివారం ఆయన మందమర్రిలో మాట్లాడుతూ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

.ఒకవైపు పదేళ్లుగా విధులు నిర్వహించిన అనుభవజ్ఞులైన సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు కొత్త వ్యక్తికి అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశించారు. కాంట్రాక్టు మారిన ప్రతిసారీ గతంలో విధులు నిర్వహించిన సిబ్బంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

పాత సెక్యూరిటీ గార్డుల తొలగింపు, కొత్త నియామకం, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, కాంట్రాక్టు నిబంధనలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరుపున ఆయన డిమాండ్ చేశారు. అర్హతలు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం గతంలో విధులు నిర్వహించిన సీనియర్ సెక్యూరిటీ గార్డులకు తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల అనుభవం ఉన్న కార్మికులను పక్కనపెట్టి కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు, వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});