మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఈ నెల 21న నిర్వహించనున్న మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో ముదిరాజ్ సోదరులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రెస్మీట్లు, సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధనపై చర్చించాలని ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ముదిరాజ్ సోదరులకు చేప పిల్లల పంపిణీ చేపట్టడంతో పాటు ప్రభుత్వ...