పసిడి, వెండి ధరలకు భారీ షాక్..
కొనుగోలుదారులకు ఊరట కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం కూడా పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే బంగారం ధర వేల రూపాయలు తగ్గగా, వెండి ధర సైతం గణనీయంగా దిగివచ్చింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థలో...