సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మందమర్రిలో రెండో రోజుకు చేరిన ఏఐటీయూసీ నిరాహార దీక్ష కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాంతిఖని మైన్‌కు చెందిన బ్రాంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ రత్నం ప్రవీణ్ నేతృత్వంలో పిట్ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో...