CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 8:51 pm Posted By: coalbelt 24 News

మందమర్రి లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని మందమర్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి మనోవికాస పాఠశాలలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వం కోసం ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మందమర్రి కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, సేవాదళ్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});