తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలి
జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో రైతు ధరావత్ రాజు క్షేత్రంలో జాతీయ ఆహార భద్రత–పోషకాహార మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం) పథకం కింద వరి పంట క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు నేరుగా వెదజల్లే సాగు పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం పథకంలో భాగంగా వానాకాలం–2026 సీజన్లో కేఎన్ఎం–1638 వరి విత్తనాలను 50 హెక్టార్ల విస్తీర్ణంలో...