CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 9:16 pm Posted By: coalbelt 24 News

కాంగ్రెస్‌కు గుడ్‌బై.. తెలంగాణ రక్షణ సేనలో చేరిక

కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి):

పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు రెడ్డి ఐలయ్య, రెడ్డి రాణి కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఉస్థెం శ్రీనివాస్ ముదిరాజ్, కల్వల రవీందర్, గంధం శంకర్, విహెచ్ హనుమాండ్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});