సింగరేణి కార్మికుల 24 పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల 24 పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంఘీభావం ప్రకటించి, దీక్షలో పాల్గొన్న కార్మికులకు మద్దతు తెలిపారు. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సింగరేణి యాజమాన్యం పెండింగ్‌లో ఉన్న 24 సమస్యలపై వెంటనే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలని కార్మిక సంఘం నాయకులు కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});