క్రీడా రంగానికి అండగా నిలవాలి
హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
కోల్ బెల్ట్ న్యూస్ క్రీడాప్రతినిధి:
ఇటీవల ఎన్నికైన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జిల్లా కార్యవర్గాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన TUWJ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనె శ్యాంసుందర్‌రావు, కనపర్తి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కార్యవర్గ సభ్యులను సన్మానించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి జర్నలిస్టులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. క్రీడలకు సంబంధించిన సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి క్రీడాకారులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం TUWJ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, జిల్లా కార్యదర్శి అలుగువెల్లి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన సూచనలు, సహాయ సహకారాలు అందించాలని జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నాయకులను కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల సహకారం అవసరమని వారు పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});