అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
రాష్ట్ర మంత్రి డా : వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి, పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు–భూగర్భ శాఖ మంత్రి డా : వివేక్ వెంకటస్వామి అన్నారు.మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్వీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్‌పల్లి, మందమర్రి ప్రాంతాలకు చెందిన నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా...