ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ఈ నెల 21న నిర్వహించనున్న మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో ముదిరాజ్ సోదరులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు పిలుపునిచ్చారు .ప్రతి గ్రామంలో ప్రెస్‌మీట్లు, సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలు, హక్కుల సాధనపై చర్చించాలని కోరారు. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ముదిరాజ్ సోదరులకు చేప పిల్లల పంపిణీతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, మత్స్యకారుల సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గ్రామస్థాయి కమిటీలు పరిశీలించాలని సూచించారు. మత్స్యకారులుగా తమకు రావాల్సిన హక్కులు, ప్రభుత్వ పథకాలు, రాయితీలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు.రాష్ట్రస్థాయి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి మత్స్యకారుల ఐక్యతను చాటాలని కొరవి నర్సింలు కోరారు. ఈ నెల 21న మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించి, హక్కుల సాధన కోసం ముదిరాజ్ సోదరులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});