CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 11:40 pm Posted By: coalbelt 24 News

ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా
మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ ధర్నాకు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరంతరం కష్టపడుతున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు తమ పార్టీ అండగా ఉంటుందని, వారి పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని స్వప్న పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వాసవి, మల్లికార్జున్, శ్రీకాంత్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});