TRS పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
బహుజన వాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బహుజన వాదం పేరుతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, చివరకు రాజకీయ ప్రయోజనాల కోసం అదే సిద్ధాంతాన్ని తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు కవితక్క రాజకీయ వైఖరిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో హరీష్ రావు వద్ద రాజకీయ విధేయతకు అలవాటు పడి, ప్రస్తుతం తన స్థాయిని మరిచి కవితపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
కవితను విమర్శించే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన గత రాజకీయ నిర్ణయాలు, వ్యవహారశైలి, ప్రస్తుత రాజకీయ వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకునే నాయకులు తమ రాజకీయ విశ్వసనీయతను ముందుగా నిరూపించుకోవాలని సూచించారు. కవితక్కపై వ్యక్తిగతంగా లేదా అనుచితంగా మరోసారి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రక్షణ సేన శ్రేణులు చూస్తూ ఊరుకోవని, తగిన రాజకీయ సమాధానం చెబుతామని సలేంద్ర కొమురయ్య యాదవ్ హెచ్చరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});