CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 6:12 pm Posted By: coalbelt 24 News

నిజామాబాద్ జిల్లాలో కవిత పర్యటన

నవంబర్ 16న పర్యటన
తెలంగాణ రక్షణ సేనలో రాజకీయ సందడి
పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆసక్తి
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

లంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నవంబర్ 16వ తేదీ సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో నేరుగా మమేకమవడం వంటి అంశాలపై ఈ పర్యటనలో దృష్టి సారించే అవకాశం ఉంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాష్ట్ర రాజకీయాల్లో తనదైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కవిత నిజామాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా ఆమె చేపట్టనున్న కార్యక్రమాలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం, స్థానిక రాజకీయ పరిణామాలపై చేసే వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పర్యటన ద్వారా జిల్లాలో తెలంగాణ రక్షణ సేన రాజకీయ కార్యకలాపాలకు మరింత ఊపునిచ్చే దిశగా పార్టీ నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});