రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టుకు స్వర్ణ పతకం
ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై 14–08 గోల్స్‌తో ఘన విజయం ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మహబూబ్‌నగర్‌లో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లతో ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టుతో తలపడింది. ప్రారంభం నుంచే దూకుడైన ఆటతీరును...