ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై 14–08 గోల్స్‌తో ఘన విజయం
ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మహబూబ్‌నగర్‌లో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లతో ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టుతో తలపడింది. ప్రారంభం నుంచే దూకుడైన ఆటతీరును ప్రదర్శించిన ఆదిలాబాద్ క్రీడాకారిణులు ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. చక్కటి సమన్వయం, వేగవంతమైన పాసింగ్, సమర్థవంతమైన రక్షణ వ్యూహాలతో ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకుంటూ గోల్స్ సాధించారు. చివరి వరకు అదే జోరును కొనసాగించి 14–08 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌గా అవతరించి బంగారు పతకాన్ని అందుకుంది.
మూడు రోజుల పాటు సాగిన ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభావంతమైన ఆటతీరుతో విజయం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టుపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీ నిర్వహణలో రాష్ట్ర, జిల్లా, స్థాయి క్రిడా సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ వ్యాయమ ఉపాధ్యాయులు, రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});