బాలల హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యం
పొన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేక బాల గ్రామసభ బాల్య వివాహాల నిరోధానికి ప్రతిజ్ఞ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పొన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేక బాల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పెంచాల మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాలల హక్కులు, వారి భద్రత, విద్య, సామాజిక బాధ్యతలపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ...