వాలీబాల్ టోర్నమెంట్‌కు ముస్తాబవుతున్న సోమగూడెం సింగరేణి గ్రౌండ్
క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు.. ఏర్పాట్లను పరిశీలించిన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు సోమగూడెంలోని సింగరేణి క్రీడా మైదానం ముస్తాబవుతోంది. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మైదానంలో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటస్థలాన్ని సిద్ధం చేయడంతో పాటు, పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం...