ఎల్‌నినో వాతావరణ మార్పులపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎల్‌నినో వాతావరణ మార్పులు, వాటి కారణాలు, ప్రకృతి పరిరక్షణలో మానవ బాధ్యతపై కరీంనగర్‌లోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల డిగ్రీ, పీజీ కళాశాల వసతి గృహంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతిమిత్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ముకుందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకృతిమిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ముఖ్య అతిథిగా...