ఉపాధి పనుల వద్ద విషాదం.. మహిళ మృతి
మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘటన కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో జరుగుతున్న VB-G RAM ఉపాధి పనులకు వెళ్లిన సిద్ధన లక్ష్మక్క అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. ఉపాధి హామీ కూలీలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంఘటన స్థలంలో పని ముగించుకున్న అనంతరం భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్న లక్ష్మక్కకు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయిందన్నారు. అందరూ చూస్తుండగానే ఆమె అక్కడికక్కడే పడిపోయింది. వెంటనే అక్కడున్న తోటి...