బీబీపేటను కరువు మండలంగా ప్రకటించాలి
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతుల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో...