CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 8:48 pm Posted By: coalbelt 24 News

బీబీపేటను కరువు మండలంగా ప్రకటించాలి

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి
ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతుల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు.వర్షాభావం కారణంగా రైతులు పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొందని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేయవద్దని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ, గతంలో తీసుకున్న వ్యవసాయ రుణాలకు వడ్డీలు చెల్లించాల్సి రావడంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రైతుల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు, తదుపరి సాగు కోసం కొత్త రుణాలు అందించాలని కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి, యాసంగి పంటల వరకు రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుల కోసం రైతులపై ఒత్తిడి పెరుగుతున్నందున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి తక్షణ ఉపశమనం కల్పించాలన్నారు. అదేవిధంగా రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయడంతో పాటు రైతు బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కొరివి నర్సింలు విజ్ఞప్తి చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});