CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 9:41 pm Posted By: coalbelt 24 News

సిద్ధిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి
కార్యక్రమంలో పలువురు నేతలు
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రక్షణ సేన పార్టీ విస్తరణలో భాగంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి బోడ జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న సలేంద్ర కొమురయ్య యాదవ్, బోడ జనార్దన్‌లు పార్టీ కార్యాలయ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రక్షణ సేనను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పార్టీ కార్యాలయం నిర్మాణంతో సిద్ధిపేటలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని, నాయకులు, కార్యకర్తలకు ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేనను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బొంగోని శంకరయ్య గౌడ్, కారుపాకల రమేష్, ఎంచెర్ల స్వామి, కల్వల తిరుపతి, సీహెచ్ హనుమాండ్లు, మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});