కామారెడ్డిలో జరిగే సమావేశానికి ముదిరాజ్ సోదరులు తరలిరావాలి
ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
రాష్ట్ర పిలుపు మేరకు ముదిరాజ్‌ల హక్కుల సాధన కోసం ఈ నెల 15వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల స్థాయి నాయకులతో పాటు ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా కొరివి నర్సింలు మాట్లాడుతూ.. ముదిరాజ్‌లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు, సమస్యలు, డిమాండ్లపై రౌండ్ టేబుల్ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి అంశంపై ముదిరాజ్ సోదరులకు అవగాహన కల్పించడంతో పాటు, హక్కుల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
15వ తేదీన ఉదయం 10:30 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే సమావేశానికి జిల్లా నాయకులు, మండల నాయకులు, ముదిరాజ్ సోదరులు ముందుగానే సమాయత్తమై పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశాన్ని విజయవంతం చేసి ముదిరాజ్‌ల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని కొరివి నర్సింలు విజ్ఞప్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});