CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 10:18 pm Posted By: coalbelt 24 News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

కాంగ్రెస్ ఫ్యూజ్ ఎగిరిపోయింది..
కొత్త ఫ్యూజ్ వేయాల్సిన బాధ్యత విద్యావంతులదే:
టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బుధవారం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందని కవిత విమర్శించారు. “పొలం కాడ ఫ్యూజ్ ఎగిరిపోతే రైతులు కొత్త ఫ్యూజ్ వేస్తారు. అదే విధంగా కాంగ్రెస్ ఫ్యూజ్ ఎగిరిపోయింది.. కొత్త ఫ్యూజ్ వేయాల్సిన సమయం వచ్చింది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తమ పార్టీ అభ్యర్థులకు రైతులు, విద్యావంతులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి, నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విద్యావంతులు ఒక అవకాశంగా మలుచుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరిని, నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను గెలిపించాలని కవిత కోరారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణలోని దాదాపు మూడో వంతు ప్రాంతంలో ఎన్నికల వాతావరణం నెలకొంటుందని, సుమారు 75 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందని తెలిపారు.

“ఇవాళ్టి నుంచే యుద్ధరంగంలోకి దిగుతున్నాం” అని కవిత ప్రకటించారు. తమ పోరాటం ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధన, నదీ జలాల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతి ప్రజా సమస్యపై పోరాటం చేయడంతో పాటు, వాటికి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను కూడా సూచిస్తున్నామని పేర్కొన్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీల మద్దతు కోరుతామని కవిత తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, తమ పార్టీ తరఫున 33 శాతం నుంచి 50 శాతం వరకు సీట్లు మహిళలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేస్తాయని కవిత తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});