భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి ఓడి బియ్యం సమర్పణ

కులమతాలకు అతీతంగా అన్నదానంలో పాల్గొన్న గ్రామ ప్రజలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. ఆదివారం ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన ఓడి బియ్యాన్ని మహాప్రసాదంగా భావించి భక్తులకు పంచేందుకు సదర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....