కులమతాలకు అతీతంగా అన్నదానంలో పాల్గొన్న గ్రామ ప్రజలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. ఆదివారం ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం అమ్మవారికి సమర్పించిన ఓడి బియ్యాన్ని మహాప్రసాదంగా భావించి భక్తులకు పంచేందుకు సదర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో కుల, మతాలకు అతీతంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. గ్రామస్తుల సహకారం, భక్తుల విశేష భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});