ధర్మారం కేంద్రంగా నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలి
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): హాజీపూర్ గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న సబ్బపల్లి, ధర్మారం గ్రామాలను కలిపి ధర్మారం కేంద్రంగా నూతన గ్రామపంచాయతీని ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సుమారు 650 ఓట్లు, 1,300 జనాభా కలిగిన ఈ రెండు గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తే ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని వారు పేర్కొన్నారు. ఈ డిమాండ్ సాధన కోసం ధర్మారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి CPI(AM) మంచిర్యాల జిల్లా నాయకులు, BLF రాష్ట్ర కన్వీనర్ సంకె రవి,...