CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 9:57 pm Posted By: coalbelt 24 News

ధర్మారం కేంద్రంగా నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలి

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

హాజీపూర్ గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న సబ్బపల్లి, ధర్మారం గ్రామాలను కలిపి ధర్మారం కేంద్రంగా నూతన గ్రామపంచాయతీని ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సుమారు 650 ఓట్లు, 1,300 జనాభా కలిగిన ఈ రెండు గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తే ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని వారు పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ డిమాండ్ సాధన కోసం ధర్మారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి CPI(AM) మంచిర్యాల జిల్లా నాయకులు, BLF రాష్ట్ర కన్వీనర్ సంకె రవి, CPI(AM) మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి రాజేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాడవి రాము, బత్తుల మధు తదితరులు నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.

గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని సంకె రవి, దాసరి రాజేశ్వరి తెలిపారు. నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. డిమాండ్ సాధించే వరకు గ్రామస్తులు చేపట్టే పోరాటాలకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొని నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు కోసం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});