CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 10:20 am Posted By: coalbelt 24 News

నేడు ఉస్మానియా యూనివర్సిటీ లో మహాధర్నా

నాన్ టీచింగ్ ఉద్యోగులకు సంఘీభావం
ధర్నా లో పాల్గొననున్న టిఆర్చీఫ్ కవిత
పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహాధర్నాకు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత మంగళవారం హాజరై సంఘీభావం తెలపనున్నట్లు పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం వారు నిర్వహిస్తున్న ఈ మహాధర్నాకు మద్దతుగా కవిత పాల్గొని ఉద్యోగుల సమస్యలను తెలుసుకోనున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మహాధర్నాకు మద్దతు తెలపాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలపై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});